మూడేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం నాలుగు సార్లు ఆర్టీసీ ధరలను పెంచిందంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్లపూడి నుంచి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో మైలవరం వరకు ప్రయాణించిన ఆయన మార్గమధ్యంలో ఆర్టీసీ బాదుడుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.